![]() |
![]() |

శివరాత్రి పండగని తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఉదయం నుండి ఉపావసం ఉండి సాయంత్రానికి దేవుడికి పలహారంగా కందగడ్డ ( స్వీట్ పొటాటో) సమర్పించి దానిని ఇంట్లోని వాళ్ళంతా కలిసి తింటారు. ఇప్పుడు అదే కందగడ్డ కి మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.
అయితే కందగడ్డని తెలంగాణలో ఒకలా.. ఆంధ్రాలో మరో పేరుతో పిలుస్తారు. దానిని కొన్నిచోట్ల కూరలా కూడా చేసుకుంటారు. అయితే శివరాత్రి కోసం తెలంగాణలో ఇప్పటికే పూజలు మొదలయ్యాయి. గంగవ్వ తెలంగాణలో ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే. తను బిగ్ బాస్ కి కూడా వెళ్ళొచ్చింది. ఇప్పుడేమో రెగ్యులర్ గా అప్‌డేట్ వ్లాగ్స్ చేస్తూ అందరికి దగ్గరగా ఉంటుంది. తను చేసే వ్లాగ్స్ కి తెలంగాణలో మంచి క్రేజ్ ఉంది. అయితే తాజాగా ' విలేజ్ షో మిక్స్ ' అనే యూట్యూబ్ ఛానెల్ లో " శివరాత్రి పండక్కు కందగడ్డ దొంగలు - గోవా ప్లానింగ్స్ " అనే వ్లాగ్ ని అప్లోడ్ చేశారు. ఇందులో గంగవ్వ, చందు, అంజిమామ , ఇంకా కొందరు కలిసి తమ ఇన్నోసెన్స్ తో పాటు సింపుల్ కామెడీతో అందరిని ఆకట్టుకుంటున్నారు. మరి ఈ వ్లాగ్ లో ఏం ఉందో ఓసారి చూసేద్దాం.
అంజిమామ, చందు కలిసి పొలంలో పండిన కందగడ్డ తీసుకొని ఊరురా తిరిగి బాగానే డబ్బులు లాభం పొందుతారు. అయితే అందరు కలిసి గంగవ్వకి తెలియకుండా గోవాకి వెళ్ళాలనుకుంటారు. దీనిలో భాగంగానే గోవా ప్లానింగ్ కోసం కందగడ్డ అమ్మగా వచ్చిన డబ్బులలో కొన్ని దాచేసి మిగిలినవి వాళ్ళ అమ్మ గంగవ్వకి ఇస్తాడు చందు. ఇక అంత తక్కువ వచ్చినయేంటని గంగవ్వ భాదపడుతుంటుంది. అది చూసి వాళ్ళ పెద్దవ్వ అంజనం వేస్తుంది. అయితే గంగవ్వ కొడుకు చందు పొలంలో పందికొక్కులు చేరి అంతా నాశనం చేసినవని, కందగడ్డ అమ్మగా వచ్చినవి రెండు వేలే అని చెప్పగా.. అంజనంలో నిజం తెలిసిపోతుంది. పొలంలో పడింది పందికొక్కులు కాదు దొంగలని ఆ పెద్దవ్వ చెప్తుంది. ఇక చేసేదేమీ లేక చందు తము చేసిన తప్పు ఒప్పుకుంటాడు. ఇక గంగవ్వ అందరిని తిడుతుంది. అయితే ఇప్పుడు ఈ వ్లాగ్ యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. మరి మీలో ఎంతమంది ఈ వీడియోని చూశారు.
![]() |
![]() |